డబ్బు – ఎందుకు, ఏమిటి ?

డబ్బు. ఈ పదం గురించి అడిగితే వేరు వేరు వ్యక్తులు వేరు వేరు విధాలుగా చెబుతారు.

కొంత మందికి డబ్బు సంపాదించటమంటే ఆసక్తి అయితే, కొంత మందికి అత్యవసరం.

ఏది ఎలా ఉన్నా డబ్బు అనేది మన జీవితంలో నుంచి విడదీయలేనిది అనేది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.

కానీ ఇంత ముఖ్యమయిన విషయం గురించి మనలో ఎంతో మంది సరయిన అవగాహన ఏర్పరచుకోరు అనేది సత్యం.

డబ్బు సంపాదించడం, సంపాదించిన డబ్బుని నిలబెట్టుకోవడం, దానిని వృద్ధి చేసుకోవడం మనందిరికీ అత్యవసరమయిన నైపుణ్యం.

ఆ నైపుణ్యం ఒక్క రోజులో వచ్చేది కాదు, అది నిరంతర ప్రక్రియ.

డబ్బుని ఏ కోణం నుంచి చూడాలి, ఎలా వాడుకోవాలి అనే విషయాలలో నా అనుభవాలని పంచుకోవడానికి నేను వ్రాసే వ్యాసాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.

డబ్బు పెట్టుబడులు ఎలా పెట్టాలి, దానికి ఉన్న సాధనాలు ఏమిటి, మనకున్న వివిధ వనరులు ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు ఇకపై చూద్దాం.

స్టాక్స్, మ్యూచువల్ ఫండ్లు, క్రెడిట్ కార్డులు, బ్యాంకింగ్ అకౌంట్లు, ఒకటేమిటి చెప్పుకోవాలే గానీ మనకి ఎన్ని విషయాలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *