
మీరు స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు ఏవి కొనుగోలు చెయ్యాలన్నా, అమ్మాలన్నా మీకు అవసరమయినది, ఉపయోగపడేది డీమ్యాట్ ఖాతా.
దీనిని ఒక బ్యాంకు ఖాతా లాగా అనుకోండి. బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేసుకున్నట్టే డీమ్యాట్ ఖాతాలో స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లూ జమ చేసుకోవచ్చు, కొనవచ్చు, అమ్మవచ్చు, ఇంకొకరికి బదిలీ చెయ్యవచ్చు. బ్యాంకుకి నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉన్నట్టే దీనికి ట్రేడింగ్ అకౌంట్ అలాగన్నమాట.
మామూలుగా అయితే ఈ రెండిటినీ కలిపి సేవలందిస్తారు.ఉదా: జీరోధా, గ్రో, అప్స్టాక్స్, ధన్ వగయిరా.
వీటిలో స్థూలంగా రెండు రకాలు ఉంటాయి డిస్కౌంట్ బ్రోకర్లు, ఫుల్ సర్వీసు బ్రోకర్లు.
ఫుల్ సర్వీసు బ్రోకర్లు స్టాక్స్, ఈక్విటీ పెట్టుబడుల సేవలు అందించటంతో పాటూ ఎందులో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి వంటి పరిశోశనా నివేదికలు కూడా అందిస్తారు. అయితే వీటి బ్రోకరేజీ చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఉదా: ఐసీఐసీఐ డైరెక్ట్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ వంటివి. ఇవి సాధారణంగా బ్యాంకులతో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి వీటి నుండి డబ్బులు తీయడం, వెయ్యడం సులువు. వీటిలో ట్రేడింగ సంబంధిత చార్జీలు పర్సెంటేజీలుగా ఉంటాయి. కాబట్టి తరచూ ట్రేడింగ్ చేసే వారికి చార్జీలు అధికంగా ఉంటాయి.

డిస్కుంట్ బ్రోకర్లు కూడా ఈక్విటీ సంబంధిత సేవలు అందిస్తారు. అయితే వీటి పరిధి సాధారణంగా ట్రేడింగ్, డీమ్యాట్ సేవలు అందించడం వరకూ మాత్రమే. మీరు ఎందులో పెట్టుబడి పెట్టాలి అనేది వీరు సలహా ఇవ్వరు. కానీ వీరి చార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదా: డెలివరీకి చార్జీలు ఉండవు, ఫ్యూచర్లూ, ఆప్షన్లూ లాంటివి చెయ్యడానికి అతి తక్కువ మొత్తం తీసుకుంటారు.
వీటిలో నేను వాడే ఒక రెండింటి గురించి చెప్పుకుందాం.
జీరోధా:

భారతదేశంలో అతి పెద్ద బ్రోకరేజీ కంపెనీ జీరోధా. వీరు గత దశాబ్దానికి పైగా స్టాక్స్ కి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి అన్ని రకాల సదుపాయాలూ అందిస్తున్నారు. వీరితో ఖాతా తెరవడం సులువు, అదీ కాక ఒక్క ఖాతా కావల్సిన వాటన్నిటికీ పనికొస్తుంది. స్టాక్స్, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, మొదలగునవి. ఆధార్ ద్వారా కేవలం ఐదు నిముషాల్లో ఖాత తెరవవచ్చు. ఇది నా ప్రధాన ఖాతగా వాడతాను.
ఈ లంకె ద్వారా జీరోధా ఖాతాని తెరవచ్చు.
ఖాతా తెరిచిన తరువాత డబ్బు అందులోకి జమ చెయ్యడానికి యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వగయిరా ఉపయోగించవచ్చు. ఆ తరువాత కావలసిన స్టాక్స్ ని ఎంచుకుని వాచ్ లిస్టులు పెట్టుకోవచ్చు, ట్రేడింగ్ చెయ్యవచ్చు, ఇన్వెస్టింగూ చెయ్యవచ్చు.
ధన్: ధన్ అనేది ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న ఒక సంస్థ. దీని గురించి చెప్పడానికి కారణం ఉంది. ఈ మధ్య వచ్చిన డిస్కౌంట్ బ్రోకర్లలో వాడడానికి చాలా సులువుగా ఉండి, అన్ని సదుపాయాలూ అందించేదిగా దూసుకుపోతూంది. మొబైల్ ఆప్ కూడా వాడడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ధన్ నా రెండవ ఖాతాగా వాడతాను. నాకు బాగా నచ్చింది. అయితే ఇందులో రిపోర్టులు ఇంకా పరిణతి చెందాల్సి ఉంది. కానీ వీరి వేగం చూస్తే త్వరలోనే మెరుగు పరుస్తారు అని అనిపిస్తుంది.
Pingback: ఇండెక్స్ ఫండ్లు అంటే ఏమిటి ? – డబ్బు