నా గురించి

వృత్తి రీత్యా సాఫ్టువేరు, ఆసక్తులు ఎన్నో. అందులో ఆర్థిక పరమైన విషయాలు చదవడం, ఆలోచించడం, ఆచరించడం ఒకటి.

పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం వల్ల చిన్నప్పటి నుండి వివిధ రకాల అనుభవాలు ఎదురయ్యాయి. వాటి నుండి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నాను. డబ్బు గురించి ఎలా ఆలోచించాలి, సముర్పాజన, వృద్ధి ఎలా చేసుకోవాలి అనేవి వాటిలో భాగం.

డబ్బు కూడబెట్టుకోవడం ఒక ప్రయాణం అయితే అది సూటిగా ఒక సరళ రేఖ లాగా ఉండదు. ఎన్నో ఎత్తులు,పల్లాలు ఉంటాయి. వాటిని దాటుకుంటూ వెళితేనే మన లక్ష్యం చేరుకోగలం అన్నది నా అనుభవం.

ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు, అనుభవాలు నేర్పిన పాఠాలు మీతో పంచుకుందామని ఈ బ్లాగు సృష్టించాను.