క్రెడిట్ కార్డులు – రివార్డు పాయింట్లు

క్రెడిట్ కార్డుల గురించి స్థూలంగా ఈ వ్యాసంలో చూసాం. వాటిని వాడాలా వద్దా అన్నది ఎవరికి వారు తీసుకోవాల్సిన నిర్ణయమైనా వాటి వాడకం వల్ల కలిగే లాభాలలో ఒకటయిన రివార్డు పాయింట్ల గురించి కూడా తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డుల వాడకం వల్ల ఉపయోగాలలో ప్రధానమైనది రివార్డు పాయింట్లు. ఇవి సరిగా వాడటం తెలిస్తే వాటి నుండి ఎంతో లాభం పొందవచ్చు.

ఉదా: ఒక కార్డుని తీసుకుని పరిశీలిద్దాం.

ఇప్పుడు ప్రస్తుతం భారత దేశంలో ఉన్న క్రెడిట్ కార్డులలో అత్యున్నతమైన వాటిలో ఒకటిగా పరిగణించబడేది హెచ్డీఎఫ్సీ ఇన్ఫీనియా కార్డు.

ఇది మరీ ఎక్కువ మందికి ఇవ్వరు. మంచి ఆదాయం ఉండి, క్రెడిట్ స్కోరు బాగుండే వారిలో తక్కువ జనాలకి ఈ కార్డుని హెచ్డీఎఫ్సీ అందిస్తుంది. కొంత మందికి జీవితాంతం ఉచితంగా అందించినా, చాలా మందికి పది వేలు వార్షిక రుసుముతో అందిస్తుంది.

మరి వినియోగదారులకీ దీని ద్వారా రివార్డు పాయింట్లు ఎలా లభిస్తాయి ?

మొదటిగా ఖర్చు పెట్టిన ప్రతీ నూట యాభై రూపాయలకీ ఐదు రివార్డు పాయింట్లు ఇస్తుంది ఈ కార్డు. అంటే సగటున మీరు వాడిన వాటికి 3.3% శాతం తగ్గింపు అన్నమాట. ఎందుకంటే ఈ రివార్డు పాయింట్లు సరిగా వాడుకుంటే (విమాన యానాలకీ, హోటల్ బుకింగులకీ) ఒక్కొక్క పాయింటూ ఒక్క రూపాయి విలువ చేస్తుంది.

ఇదీ కాక స్మార్ట్ బయ్ అనే పోర్టల్ ద్వారా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైను పోర్టల్ కొనుగోళ్ళకి ఐదు నుండి పది రెట్లు ఎక్కువ రివార్డు పాయింట్లు అందిస్తుంది. అంటే ఐదు రెట్లు తీసుకుంటే దాదాపు ప్రతీ కొనుగోలు పైనా 15 శాతం తగ్గింపు అన్నమాట. గిఫ్ట్ వౌచర్లు కొంటే పది రెట్లు ఇంతకు ముందు ఇచ్చేది. అంటే 30 శాతం వరకూ తగ్గింపు.

ఇది కాక మీరు గనక తరచూ విమాన యానం చేసేట్టయితే లౌంజ్ లని ఉచితంగా వాడుకునే వీలుని కలిపిస్తుంది. అలాగే ఉచితంగా గోల్ఫ్ ఆడే సదుపాయం కలిగిస్తుంది. ఉచిత జీవిత భీమా అందిస్తుంది.

ఈ కార్డుని వాడే పద్ధతిని బట్టి రివార్డు పాయింట్లని జమ చేసుకుంటూ వెళ్తే దేశీయ విమానయానం మాత్రమే కాక విదేశీ విమాన యానాలకే సరిపోయిన పాయింట్లు సమకూర్చుకోవచ్చు. అలా వాడే వారు ఎంతో మంది.

అయితే ఈ పాయింట్ల కోసమని అదనపు ఖర్చులు పెట్టమని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ మీరు పెట్టే సాధారణ ఖర్చులతో ఉచితంగా లభించగలిగిన రివార్డు పాయింట్లు వస్తే తప్పకుండా వాడవచ్చు.

ఇది నేను తీసుకున్న ఒక ఉదాహరణ. అయితే ఇలాంటి లగ్జరీ కార్డులు ఎన్నో ఉన్నాయి. అమెక్స్, హెచ్డీఎఫ్సీ, ఆక్సిస్, ఎస్బీఐ వంటి వాటి నుండి ఇలాంటి కార్డులు వినియోగదారుడికి తగ్గట్టు లభిస్తాయి.

రివార్డు పాయింట్లు ఒక ఎత్తయితే తరచూ ఆన్లైను సంస్థలలో ఇచ్చే తగ్గింపు ధరలు కూడా ఈ కార్డుల వల్ల మంచి లాభం.

సాధారణ క్రెడిట్ కార్డులు అందరికీ లభించినా అత్యున్నతమయినవి ఇవ్వడానికి ఆ బ్యాంకు దగ్గర సేవింగ్స్ అకౌంటు ఉండి, మంచి బాలన్స్ కలిగి ఉండి, క్రెడిట్ స్కోరు బాగున్న వారికి మాత్రమే ఇస్తారు. కాబట్టి ఇలాంటి క్రెడిట్ కార్డులు కావాలంటే ఒకే బ్యాంకుతో సంబంధం కలిగి ఉంటే ఉపయోగకరం. ఉదా: మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతా తెరవదలచుకుంటే ఇక్కడ నుండి తెరవవచ్చు.

కాబట్టి మీ కార్డులకి ఉన్న రివార్డులు, వాటికి ఉన్న ఇతరత్రా సదుపాయాల గురించి తెలుసుకుంటే మీరూ సరయిన పద్ధతిలో వాడుకోగలుగుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *