
క్రెడిట్ కార్డులు, వాటి రివార్డు పాయింట్ల గురించి ఈ టపాలో తెలుసుకున్నాము. అయితే క్రెడిట్ కార్డుల వల్ల వచ్చే చిక్కులు అవి సరయిన సమయానికి చెల్లించకపోవడం. మరి చెల్లింపులు మర్చిపోకుండా చెయ్యడం ఎలా ?
ఈ ప్రశ్నకి సమాధానం ఎన్నో రకాలుగా సాధ్యం.
ఒకటి – మీ క్యాలెండరులో ఒక అలెర్ట్ పెట్టుకోవడం. మీరు కట్టాల్సిన తేదీకి ఒక వారం ముందుగా ఒక అలెర్ట్ పెట్టుకుని, ఆ రోజు కట్టాల్సిన మొత్తం తప్పకుండా కట్టివెయ్యడం. ఇది తేలికైన పద్ధతి. కానీ మీకు ఒకటి కంటే ఎక్కువ కార్డులు కనుక ఉంటే ఈ పద్ధతి కూడా సులువు కాదు.
క్రెడ్ – క్రెడ్ అనేది ఒక ఆప్. ఇది మీ క్రెడిట్ కార్డు చెల్లింపులని మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఆధారంగా ట్రాక్ చేస్తుంది. కానీ దీనికి మీ ఈ మెయిల్ ఖాతా అనుసంధించాల్సి వస్తుంది. మీ కార్డ్ చెల్లింపు తేదీలని ఇది ఆటోమేటిగ్గా ట్రాక్ చేసి కట్టాల్సిన రోజులకి ముందే మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
దీంట్లో ఖాతా తెరవాలంటే మీ క్రెడిట్ స్కోర్ మంచిది అయి ఉండాలి. ఈ లంకె ద్వారా మీరు క్రెడ్ లో ఖాత తెరవవచ్చు.
దీని వల్ల లాభం మీరు కట్టిన కార్డ్ బిల్లులని బట్టి మీకు రివార్డు పాయింట్లని ఇస్తుంది. కొన్ని సార్లు వీటిని డబ్బుగా కూడా పొందే అవకాశం ఉంది.

చెక్ – చెక్ అనేది ఈ మధ్యనే మొదలయిన ఆప్. ఇది కూడా క్రెడ్ లాగా క్రెడిట్ కార్డ్ చెల్లింపులని ట్రాక్ చేసి, కట్టినందుకు మీకు క్యాష్ బ్యాక్ ఇస్తుండి. అది కూడా 1%. అంటే మీరు వెయ్యి రూపాయలు దీని ద్వార బిల్లు కడితే ఇది మీకు పది రూపాయలు వెనక్కి ఇస్తుందన్నమాట. ఈ మొత్తాన్ని మీరు వౌచర్ల గానో లేక ఇతర కార్డు బిల్లులని కట్టడానికి గానో ఉపయోగించవచ్చు.
దీంట్లో ఖాతా తెరవాలంటే మీరు ఈ లంకె ద్వారా తెరవవచ్చు.
పై ఆప్ లని ఉపయోగించి, మీ కార్డు తేదీలని తప్పకుండా సరయిన తేదీలకి మీ కార్డు చెల్లింపులని చెయ్యండి.