ఇండెక్స్ ఫండ్లు అంటే ఏమిటి ?

మ్యూచువల్ ఫండ్లు అన్నో రకాలు. వాటిలో ఏవి మంచివో ఆచి తూచి ఎన్నుకోవడం అంత తేలికయిన పని కాదు. ప్రస్తుతం ఉన్న మ్యూచువల్ ఫండ్లు కొన్ని వందలు ఉన్నాయి. మరి వాటిలో మీకు నప్పేవి ఏవి, దీర్ఘకాలం మదింపు చెయ్యగలిగినవి ఏవి అన్న రీసెర్చ్ చెయ్యడం అందరికీ కుదరదు. మరి అలాంటప్పుడు సులువుగా ఎంచుకోగలిగిన మ్యూచువల్ ఫండ్లు ఇండెక్స్ ఫండ్లు. అసలు ముందుగా ఇండెక్స్ అంటే ఏమిటి అన్నది చూద్దాం. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనేది మార్కెట్… Read More »

క్రెడిట్ కార్డ్ చెల్లింపులు

క్రెడిట్ కార్డులు, వాటి రివార్డు పాయింట్ల గురించి ఈ టపాలో తెలుసుకున్నాము. అయితే క్రెడిట్ కార్డుల వల్ల వచ్చే చిక్కులు అవి సరయిన సమయానికి చెల్లించకపోవడం. మరి చెల్లింపులు మర్చిపోకుండా చెయ్యడం ఎలా ? ఈ ప్రశ్నకి సమాధానం ఎన్నో రకాలుగా సాధ్యం. ఒకటి – మీ క్యాలెండరులో ఒక అలెర్ట్ పెట్టుకోవడం. మీరు కట్టాల్సిన తేదీకి ఒక వారం ముందుగా ఒక అలెర్ట్ పెట్టుకుని, ఆ రోజు కట్టాల్సిన మొత్తం తప్పకుండా కట్టివెయ్యడం. ఇది తేలికైన… Read More »

డీమ్యాట్ ఖాతా – జీరోధా, ధన్

మీరు స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు ఏవి కొనుగోలు చెయ్యాలన్నా, అమ్మాలన్నా మీకు అవసరమయినది, ఉపయోగపడేది డీమ్యాట్ ఖాతా. దీనిని ఒక బ్యాంకు ఖాతా లాగా అనుకోండి. బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేసుకున్నట్టే డీమ్యాట్ ఖాతాలో స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లూ జమ చేసుకోవచ్చు, కొనవచ్చు, అమ్మవచ్చు, ఇంకొకరికి బదిలీ చెయ్యవచ్చు. బ్యాంకుకి నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉన్నట్టే దీనికి ట్రేడింగ్ అకౌంట్ అలాగన్నమాట. మామూలుగా అయితే ఈ రెండిటినీ కలిపి సేవలందిస్తారు.ఉదా:… Read More »

భీమా – ఎందుకు, ఎలా ?

భీమా అంటే ఏమిటి ? – మీకు ఏదయినా అనుకోని నష్టం కలుగుతుంది అనుకుంటే దాని నుండి మీరు కాపాడుకోగలిగే ఒక సాధనం భీమా. అంటే భవిష్యత్తులో జరగగలిగే నష్టాన్ని గుర్తించగలిగి ఆ ప్రమాదాన్ని గురించి మీరు ప్రణాళిక ప్రకారం ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవడం. భీమా అనేది ఇద్దరి మధ్యన ఒప్పందం. ఇందులో ఒకరు భీమా తీసుకున్న మీరయితే ఇంకొకరు ఆ భీమా జారీ చేసే సంస్థ. మీరు ఆ సంస్థ నుండి మీకు జరగగలిగే… Read More »

క్రెడిట్ కార్డులు – రివార్డు పాయింట్లు

క్రెడిట్ కార్డుల గురించి స్థూలంగా ఈ వ్యాసంలో చూసాం. వాటిని వాడాలా వద్దా అన్నది ఎవరికి వారు తీసుకోవాల్సిన నిర్ణయమైనా వాటి వాడకం వల్ల కలిగే లాభాలలో ఒకటయిన రివార్డు పాయింట్ల గురించి కూడా తెలుసుకుందాం. క్రెడిట్ కార్డుల వాడకం వల్ల ఉపయోగాలలో ప్రధానమైనది రివార్డు పాయింట్లు. ఇవి సరిగా వాడటం తెలిస్తే వాటి నుండి ఎంతో లాభం పొందవచ్చు. ఉదా: ఒక కార్డుని తీసుకుని పరిశీలిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం భారత దేశంలో ఉన్న క్రెడిట్ కార్డులలో… Read More »

మ్యూచువల్ ఫండ్లు – ఈక్విటీ

ఇంతకు ముందు వ్యాసంలో మనం ఈక్విటీ మన పోర్ట్ఫోలియో లో ఎందుకు అవసరమో చెప్పుకున్నాం. అది మ్యూచువల్ ఫండ్ల ద్వారా కూడా ఎలా సాధ్యమో చూసాం. అయితే మ్యూచువల్ ఫండ్లు కేవలం ఈక్విటీ కోసమే కాకుండా డెట్ మార్కెట్లలో మదుపు చేసేవి కూడా ఉంటాయి. ఈ మ్యూచువల్ ఫండ్ల కథా కమామీషు ఏమిటి ? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు చర్చిద్దాం. మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్థూలంగా రెండు రకాలు. డెట్, ఈక్విటీ. స్థూలంగా అని… Read More »

క్రెడిట్ కార్డులు – వాడాలా వద్దా ?

మనలో చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. అప్పు అన్నది చెడ్డదయితే మరి క్రెడిట్ కార్డు వాడటం కూడా చెడ్డదే కదా. ఎందుకంటే అది ఒక అప్పు లాంటిది. మరి క్రెడిట్ కార్డు ఉపయోగించాలా వద్దా అన్నదాని మీద చర్చించుకుందాం. ముందుగా ఓ చిన్న విషయం. ఏదయినా ఒక సేవని వినియోగించుకునేప్పుడు మంచీ, చెడూ రెండూ ఉంటాయి. పరిస్థితిని బట్టీ, మన మనస్థత్వాన్ని బట్టీ అది మనకి మంచి లేదా చెడు అవుతుంది. అలాగే క్రెడిట్ కార్డు… Read More »

స్థిర ఆదాయం, ఈక్విటీ …

స్థిర ఆదాయం, ఈక్విటీ, రియల్ ఎస్టేట్, బంగారం పెట్టుబడులకు సంబంధించి మనం తరచూ వినే మార్గాలు. అసలు అవంటే ఏమిటి ? మన పెట్టుబడులకూ వాటికీ సంబంధం ఏమిటి అని చర్చించుకుందాం. మీరు ఇప్పటికే చదివి ఉండకపోతే ఈ టపా చదివి రండి. మనం చెప్పుకునే వాటికి నేపథ్యంగా పనికొస్తుంది. ఇంతకు ముందు టపాలో మనం ద్రవ్యోల్బణం గురించి చెప్పుకున్నాం. మన పెట్టుబడులు దానిని అధిగమించి ఎందుకు ఉండాలో కూడా చర్చించుకున్నాం. మరి మనం ఆ పెట్టుబడులు… Read More »

పెట్టుబడి, ద్రవ్యోల్బణం, చక్రవడ్డీ …

మన ధన సముర్పాజన ప్రయాణంలో కొన్ని విషయాలు మనకు కనీసంగా తెలిసుండాలి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. పెట్టుబడి: డబ్బు దాచుకోవడానికీ, పెట్టుబడి పెట్టడానికీ చాలా తేడా ఉంది. డబ్బు దాచుకోవడం అంటే మనం ఆర్జించే మొత్తంలో కొంత పక్కకు తీసి పెట్టుకోవడం. పెట్టుబడి పెట్టడం అంటే మనం దాచుకున్న డబ్బుని వృద్ధి చెందే సాధనాలలో దాచడం. ఉదా: మీకు వచ్చిన ఆదాయంలోమీకు ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఉన్నాయి. వాటిని మీ ఇంటి గల్లా పెట్టెలో… Read More »

డబ్బు గురించి ఆలోచించడం ఎలా ?

డబ్బు గురించి చెప్పుకునేముందు, అసలు డబ్బు గురించి ఎలా ఆలోచించాలి అనే అవగాహన ముఖ్యం. చిన్న పిన్నీసు నుండి, పెద్ద కార్ల దాకాఇవాళ కావలసిన అత్యవసర సరుకుల నుండి, రేపు అరవై దాటాక బ్రతకడానికీఅన్నిటికీ డబ్బు కావాలి. మరి ఆ డబ్బు ని గురించి ఒక ప్రణాళిక ఉండటం చాలా ముఖ్యం. దానిని ఈ క్రింది విధంగా చేసుకోవచ్చు. స్థితిగతుల బేరీజు: అన్నిటికన్నా ముఖ్యమయినది మన ప్రస్తుత స్థితిగతులు ఏమిటి అన్నది తెలుసుకోవడం. అంటే మన ఆదాయ, వ్యయాలు… Read More »